పాట `344
ప: చూడు మదే నీ కొరకే సిలువపై వ్రేలాడు శ్రీయేసు రక్షకున్
1. నలుగ గొట్టబడె నీకై పలుకకుండె మారుగ
శిరస్సున రక్తధారలు విరచె రెక్కలను గ్రుచ్చ
నీ పాపమే, పాదవలను చీల్చెను బల్లెమై ప్రక్కన్ బొడిచె
2. రక్తసిక్తమై మోవ ఎఱ్ఱనయ్యె కొయ్యపై
చూడు వీపును దున్నెను దీనునిగా జేసె నీ పాపమే
ప్రభు రక్తవ ఏరులై పారెను నీ కొరకే సిలువపై
3. గాయమైన చేతులన్ దినమెల్ల చాపెనో పాపీ
చూచుచుండె ప్రేమతో నీకై కన్నీటిని కార్చును
తన కృపతో సంధించును పాపీ విను చేరుచెంతన్ నీక్షణమే
4. ఎంతకాల మేడ్పించి వెలుపలనుంతు వతనిని
తెరువు హృదయ ద్వారవన్ పొందు మారు మనస్సును
ఈ దినమే నీ పాపవల్ క్షమింంచును నీకిచ్చును రక్షణను