పాట `197
ప: ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి
కృపవెంబడి కృపను
1. ప్రభువైన యేసుక్రీస్తు పరలోక విషయములో
ప్రతి ఆశీర్వాదమును ప్రసాదించితివి మాకు ॥ప్రభు॥
2. జనకా నీ వెన్నుకొనిన జనుల క్షేమము జూచి
సంతోషించునట్లు నను జ్ఞాపకముంచుకొనుము ॥ప్రభు॥
3. నీదుస్వాస్థ్యమైనట్టి నీ ప్రజలతో కలిసి
కొనియాడునట్లుగా నను జ్ఞాపకముంచుకొనుము ॥ప్రభు॥
4. దేవా నీ ప్రజల యెడల దిన దినము నీకున్న
ఘనుడా నీదు దయతో నను జ్ఞాపకముంచుకొనుము ॥ప్రభు॥
5.దేవా నీదు స్వరూప దివ్య దర్శనమును
దినదినమునా కొసగి నను జ్ఞాపకముంచుకొనుము ॥ప్రభు॥
6. మీ మధ్యన నా ఆత్మ ఉన్నది భయపడకుడనిన
మహోన్నతుడా నను జ్ఞాపకవంచుకొనుము ॥ప్రభు॥
7.వదమార నన్నెన్నుకొని వద్రయంగరవగను
చేతుననిన ప్రభువా నను జ్ఞాపకవంచుకొనుము ॥ప్రభు॥
8. కృప సత్య సమ్మిళిత సంపూర్ణ స్వరూప
హల్లెలూయ నీకే ప్రభో ఎల్లప్పుడు కలుగుగాక ॥ప్రభు॥