పాట `28
ప: సర్వేశ్వరా నీకే స్తుతి సర్వము నీకే ప్రభూ
ఆధారము ఆశ్రయము నీవే నా యేసు
అ.ప: నన్ను కన్న తండ్రి నన్ను కొన్నా తండ్రి
రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి (2)
1.చిన్న చిన్న గొర్రెపిల్లలకు కాపరివై మవ కాయుము
అమ్మ నాన్న అన్నీ నీవే ఆదరించి సేదతీర్చుము (2) ॥నన్ను॥
2. పరుగెత్తినా కొండ కోనలలోన పచ్చని పచ్చికలో
అండా దండా కొండా కోనా నీవే నా యేసు (2) ॥నన్ను॥
3.చెంగు చెంగుమని దూకే నన్ను కంగారు పడనీయకు
గుట్టలను, మెట్టలను దాటించి నన్ను మేపుమువ (2) ॥నన్ను॥
4.సంకెళ్ళచే లోక బంధాలలో ఎందాక నీవుందువు
ఓ సోదరా, ఓ సోదరి నేడే విడుదల నొందు (2) ॥నన్ను॥