ప: రండి రండి యేసునియుద్దకు రమ్మను చున్నాడు ప్రయాసపడి
భారము వెయువారలు ప్రభుని చెంతకు పరుగిడి వేగమే
1. యేసుని పిలుపు వినియు నింక యోచింపరేల ఆవనిలో
ఆగచాట్ల పాలైన దొరకదు శాంతి ఆత్మకునిలలో (రండి)
2. ప్రభుయేసు నీ కొరకై తనదు ప్రాణము నిచ్చెగదా శిలువను
రక్తము చిందించియును బలియాయెను ఆ ఘనుడు మనకై (రండి)
3. యేసుని నామమునందే పరమ నివాసము దొరకును వక్తిని
పాప విమోచనమును శక్తిమంతుడు యేసే ంచ్చును (రండి)
4. పాపుల రక్షణ కొరకై యేసే లోకమునకు వచ్చెను అను
వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైయుjన్నది (రండి)
5. నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమును నేనేగా కింకెవ్వరు
లేరని యెంచి చెప్పిన యేసునియుద్దకు (రండి)
6. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయామెన్ హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (రండి)