ప: దేవర నీ దీవెనలు ధారాళముగను వీరలపై
బాగుగ వేగమై దిగనిమ్ము పావన యేసుని ద్వారగను
1. దంపతులు దండిగనీ ధాత్రిలో వెలయుచు సంపదలన్ సొంపుగ
నింపుగ పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై ||దేవ||
2. ఈకవనునీ కరుణన్ ఆఖరు వరకును లోకములో శోకము
లేకయే నేకముగా బ్రాకటముగను జేకొనుము ||దేవ||
3. ఇప్పగిది నెప్పుడును గొప్పగు ప్రేమతో నొప్పుచు దామెప్పిన
చొప్పున దప్పికను మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్ ||దేవ||
4. తాపములు పాపములు మోపుగ వీరిపై రాకుండగ
కాపుగ బ్రాపుగ దాపు నుండి ఆపదలన్నియు బాపుచును ||దేవ||
5. సాధులుగన్ చేయుటకై శోధనలచే నీవు శోధింపగ కదలక
వదలక ముదమున నీ పాదము దాపున బాదుకొనన్ ||దేవ||
6. మెండుగ భూమండలపు గుండములలో వీరుండగను తండ్రిగ
దండిగనండనుండి వెండియు వానిని ఖండింపగనే ||దేవ||
7. ఇద్దరు వీరిద్దరును శుద్ధులై మిమ్ము సేవించుటకై
శ్రద్ధతో బుద్దిగా సిద్దపడన్ దిద్దుము నీ ప్రియబిడ్డలుగన్ ||దేవ||
8. వాసిగనీ దాసులము జేసిన యీ మొరల్ దీసికొని
మా సకలేశ్వర నీ సుతుడౌ యేసుని పేరిట బ్రోవు మామేన్ ||దేవ||