పాట`135
ప: సుందర రక్షకుడా మాదు స్వతంత్రమైన దేవా
అ.ప: ఎల్లప్పుడు మేము నిన్నే స్తోత్రించు చుండ
స్తుతి యిదియే సుందర రక్షకుడా
1. రాజాధిరాజ నీవే మా షారోను రోజ నీవే
త్వరగా వత్తుననిన గొప్ప దేవా నరులమము జూడుమా ॥సుం॥
2. వ్యాధిగ్రస్తుల వైద్యుడా యూద గోత్రమున బుట్టితి
నార్తురాలైన నాయీను విధవ కుమారుని లేపితివి ॥సుం॥
3. రత్నవర్ణ వదనుడా యూద కన్య మరియు కాత్మజా
మన్నించిపరమున జేర్చువాడా మమ్ము బ్రేమజూడుమా ॥సుం॥
4. నాకము పట్టలేని వాడా లోకమునకు వచ్చితీ జీవ
పానమిచ్చి దాహము తీర్చితివి హీనునిలో నుండుమా ॥సుం॥
5. మార్గం సత్యం జీవమై మమ్ము కున్కక కాపాడుచు అర
చేతిలో మమ్ము చెక్కియున్నవాడా మంచిగొల్లబోయుడా ॥సుం॥
6. ఆశ్చర్యకరుడ నీవే మంచి ఆలోచన కర్తయు
బలుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధాన ప్రభువు ॥సుం॥
7. హల్లెలూయా పాడను మహా సత్యాత్మ వరమీయను
న్యాయము తీర్చుట కేతెంచువాడా నిల్వక రారమ్మయా ॥సుం॥