పాట`129
ప: కృపా కనికరముల మా దేవా కృతజ్ఞత నర్పింతు
1. యెహోవా చేసిన ఉపకారములకై ఆయన కేమి చెల్లింతును
యెహోవా నామమున ప్రార్థన జేసెదను రక్షణ పాత్ర చేబూని ॥కృప॥
2. యెహోవాకు నా మ్రొక్కుబడి చెల్లింతు యెహోవా
దాసుడను నేను యెహోవా ప్రజలలో
యెరూషలేములో ఎల్లప్పుడు స్తుతింతు ॥కృప॥
3. తల్లి గర్భమున రూపింపబడక మునుపె నన్ను ఎరిగితివి
తల్లి గర్భము నుండి బయలుపడకముందే ప్రతిష్టించితివి ॥కృప॥
4. పూర్ణ మనస్సుతో నన్ను వెదకిన నన్ను కనుగొందురంటివి
కరుణతో నీవే నన్ను వెదకి రక్షించితివి ప్రభువా ॥కృప॥
5. దూషకుడను హింసకుడను హానికరుడనై యుంటివి
దాసునిగా నన్ను జేసికొంటివి దోషముల బాపి ॥కృప॥
6. ఇది నీ కొరకై విరువబడిన నా శరీరమనియంటివి
ఇది నీ పాప క్షమకొరకై చిందిన రక్తమంటివి ॥కృప॥
7. నీదు కృపతో నాదు యేసు నన్ను నీవు రక్షించితివి
కాదు నాదు క్రియలవలన ఇది దేవుని వరమే ॥కృప॥
8. చెప్పనశక్యము మహిమాయుక్తము నీ నొసంగిన సంతోషము
తప్పకుండ హల్లెలూయ పాటపాడెదన్ ॥కృప॥