పాట`136
ప:రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు
రక్షకు నాశ్రయించి నే ధన్యుడనైతిని
1.గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడ నీవే
తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే
2.మహోన్నతుడవగు దేవా ప్రభావాము గలవాడా
మనస్సార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్
3.మంచితనము గలదేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో
ముదమార పాడెదనిన్ను అతి సుందరుడవనియు
4.నా జీవితమంతయును యెహోవాను స్తుతియించెదను
నా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతున్
5.సంతోషించు నెల్లప్పుడు కష్టదు:ఖ బాధలలో
ఎంతో నెమ్మదినిచ్చు నా రక్షకుడు యేసు
6.ప్రార్థింతును ఎడతెగక ప్రభుసన్నిధిలో చేరి
సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని
7.కృతజ్ఞత చెల్లింతు ప్రతి దాని కొరకు నేను
క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను