పాట`153
ప: ప్రభుయేసు నా రక్షకా నొసగు
కన్నులునాకు నిరతము నే నిన్ను జూడ ॥2॥
అల్ఫాయు నీవే ఓమేగయు నీవే
1.ప్రియుడైన యెహాను పత్మాసులో
ప్రియమైన యేసూనీ స్వరూపము
ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె
ప్రియప్రభు నినుజూడనిమ్ము ॥ప్రభు॥
2. లెక్కలేని మార్లు పడిపోతిని
దిక్కులేనివాడ నేనైతిని
చక్కచేసి నా నేత్రాలు దెరచి
గ్రక్కున నిను జూడ నిమ్ము ॥ప్రభు॥
3. ఎరిగి యెరిగి నే చెడిపోతిని
యేసూ నీ గాయము రేపితిని
సపోతి నేను దృష్టి దొలగితి
దాసుడ నిను జూడనిమ్ము ॥ప్రభు॥
4.ఎందరేసుని వైపు చూచెదరో
పొందెదరువెల్గుముఖమున
సంధియంబు లేకసంతోషించుచు
ముందుకు పరుగెత్తెదరు ॥ప్రభు॥
5.విశ్వాసకర్తా ఓ యేసూ ప్రభూ
కొనసాగించువాడుయేసుప్రభూ
వినయముతో నేనునీ వైపు జూచుచు
విసుగక పరుగెత్తె నేర్పు ॥ప్రభు॥