పాట `173
ప: విజయ గీతముల్ పాడరే`క్రీస్తుకు
జయ`విజయగీతముల్ పాడరే
వృజిన మంతటి మీద `విజయ మిచ్చెడు
దేవ`నిజకుమారుని నామమున్
హృదయములతో`భజన జేయుచు నిత్యమున్ ॥విజయ॥
1.మంగళముగ యేసుడే`మనకు రక్షణ ` శృంగమై
మరి నిల్చెను `నింగిన్ విడిచి వచ్చెను`శత్రుని యుద్ధ`రంగమందున గెల్చెను రంగు
మీర గ దన`రక్తబలము వలన`పొంగు
నణ గ జేసెను ` సాతానునిబల్ ` క్రుంగ నలిపి చీల్చెను ॥విజయ॥
2. పాపముల్ దొలగింపను`మనలను దన
స్వ`రూపంబునకు మార్పను`శాపం బంతయు నోర్చెను
`దేవుని న్యాయ`కోపమున్ భరియించెను
పాప మెరుగని యేసు`పాపమై మనకొరకు`పాపయాగము దీర్చెను `
దేవుని నీతిన్`ధీరు డై నెరవేర్చెను ॥విజయ॥
3.సిలువ మరణము నొందియు ` మనలను
దనకై ` గెలువన్లేచినవానికి `చెలువుగన్ విమలాత్ముని`ప్రేమను మనలో`నిలువన్ జేసిన
వానికి`కొలువు జేతుమెగాని`ఇలను మరువక
వాని`సిలువ మోయుచునీ కృపా`రక్షణ చాల`
విలువ గలదని చాలును ॥విజయ॥