పాట `74
ప: షాలేం మందిరం...(4) ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... (4)
ప్రభు ప్రేమ మధురం ప్రభుశాంతి సుందరం (2)
పొందాలి మనమందరం దొరికే స్థలమే మందిరం (2)
షాలేం మందిరం... (4)
1. మెల్లని స్వరము తో పిలుచుటకు
దేవుని వాక్కును రుచి చూపుటకు (2)
రక్షణ భాగ్యం నొసగుటకు షాలేంపురము చేర్చుటకు (2)
వెలసెను శాంతి నివ్వ మానవాళికై షాలేం మందిరం(2) ॥ప్రభు॥
2. అశాంతి నిచ్చు ఈ లోకంలో నెమ్మదికై మనిషి వెతుకులాటలో
కానరానిచీకటిలో నడిపింప నిన్నువెలుగులో(2)
వెలసెను శాంతి నివ్వ మానవాళికై షాలేం మందిరం ॥ప్రభు॥
3. స్తుతులతో దేవుని కొలుచుటకు దేవుని మార్గము చాటుటకు
సర్వము శాంతి పొందుటకు దేవుడే మహిమ పొందుటకు(2)
వెలసెను శాంతి నివ్వ మానవాళికై షాలేం మందిరం ॥ప్రభు॥