433
ప:లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు
లేచినాడురా సమాధి గెలిచినాడురా
లేతునని తాజెప్పినట్లు లేఖనములో పలికినట్లు (లే)
1.భద్రమువగా సమాధిపైని పెద్దరాతినియుంచిరి భటులు
ముద్రవేసి రాత్రియంత నిద్రలేక కావలియున్న (లే)
2.ప్రభువు దూత పరమువనుండి త్వరగదిగి రాతిని పొర్లించి
భళిర దానిపై కూర్చుండె భయమువ నొంద కావలివారు (లే)
3.ప్రొద్దు పొడవకముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధమును
శ్రద్ధతోడ తెచ్చి యేసుకు రుద్దుదామని వచ్చి చూడ (లే)
4.చూడవెళ్లిన స్త్రీలను దూత చూచియపుడే వారి తోడ
లేడు గలిలయ ముందుగ పొతున్నాడు అపుడే లేచినాడని (లే)
5.చచ్చిపోం లేచినాడు స్వామి భక్తుల కగుపడినాడు చచ్చినను
నను లేపుతాడు చావు అంటె భయపడరాదు (లే)
6.నేనే చేయపనుల నెరుగు నేను నడచు మార్గ మెరుగు
నేను చెప్పు మాటలెరుగు నేను బ్రతికె బ్రతకునెరుగు (లే)
7.నేను లేచిన యేసునందు మానక మది నము్మకొందు తాను
నాలోయుండినందున దయను జేర్చును మోక్షమందు (లే)
8.పాప భారమువలేదు మనకు మరణ భయమువలేదు మనకు
నరక బాధలేదు మనకు మరువకండి యేసు ప్రభుని (లే)
9.యేసు నందే రక్షణ భాగ్యం యేసు నందే నిత్య జీవం
యేసునందే ఆత్మశాంతి యేసునందే మోక్ష భాగ్యం (లే)
10.పాపులకై వచ్చినాడు పాపులను కరుణించినాడు పాపులను ప్రేమించినాడు
ప్రాణదానవ చేసినాడు (లే)