పాట `14
ప: ఆశ్రయమా నా యేసయ్య తరతరవలకు నివాసమా
ఎవరు లేరయ్యా దిక్కు వెక్కు నాకు నీవేనయ్యా ॥ఆశ్రయమా॥
అ.ప: ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే
1.వ్యాధి బాధలతో నేను దిక్కు లేక పడియుండగా
నీకు నేను వెర్రపెట్టగా దీనుని కరుణించావే ॥ఆరా।
2.ఆకోరు శ్రమగల లోయలో శపితమైన నా బ్రతుకున్
నా పాప శాప ఋణమును కల్వరి గిరిపై తీర్చితివా ॥ఆరా॥
3.నీ రెక్కలే నాకు ఆశ్రయము నిన్ను నేడు ఎల్లకాలము
మహిమలోనే చేరువరకు విడువని నా యేసయ్యా ॥ఆరా॥