పాట`229
ప: యేసు నీ నామామృతము మా`కెంతో
రుచి యయ్యా`దేవ R మా
దోసములను హరించి మోక్షని`వాసులుగ
జేయుటకు`బాసుర ప్రకాశమైన ॥యేసు॥
వేడు కలరగ గూడినిను గొని యాడు వారికి
` దేవ R యెంతో `కీడు జేసిన పాడు వైరిని`ల
గోడుగో డనంగ వాని`తాడనము జేసితిని ॥యేసు॥
పాపములు హరింప నీవే` ప్రాపు మాకయ్యా `
దేవ R యెంతో `జేరిన వారి కందరి `
కాపదలు బాపి నిత్య` కాపుగతి జూపినావు ॥యేసు॥
అక్షయ కరుణేక్ష భువన ` రక్షకా నీవే `
దేవR మమ్ము ` పక్షముగరక్షించి మోక్షసు `
రక్షణకు దీక్ష గొని `వీక్షితులమైన మాకు ॥యేసు॥
అందమగు నీ మందిరమున ` బొందుగా మేము `
దేవ R నీ `సుందరకరుణామృతము మా`
డెందములయందు గ్రోలు`టందుకు సుందరమైన ॥యేసు॥