ప: నడిచెద నే ప్రభు యేసునితో నడిచెద నే ప్రభు హస్తముతో కాంతిలో
నుండగా నే జయం గాంతును యేసునే నే వెంబడిరతును
1. నే యేసుని వెలుగులో నడిచెదను రాత్రింబగలాయనతో నడిచెదను
వెల్గున్ నడిచెదను వెంబడిరచెదను యేసుడే నా రక్షకుడు (నడి)
2. నే యేసుని వెలుగులో నడిచెదను గాఢంబగు చీకటిలోభయపడను
ఆత్మతో పాడుచు సాగిపోవుదును యేసుడే నా ప్రియుండు (నడి)
3. నే యేసుని వెలుగులో నడిచెదను దిన సహాయమునే పొందెను
సుఖ దుఃఖమైన మరణంబైన యేసుడే నా ప్రియుండు (నడి)
4. నే యేసుని వెలుగులో నడిచెదను నా దృష్టిని ప్రభుపై నుంచెదను
సిల్వ ధ్వజమునే బట్టి వెళ్ళెదను యేసుడే నా చెంత నుండును (నడి)