పాట `65
ప: హే ప్రభుయేసు హే ప్రభు యేసు హే ప్రభు దేవసుతా సిల్వధరా
పాప హర, శాంతికరా (హే ప్రభూ)
1. శాంతి సమాధానాధిపతీ స్వాంతములో ప్రశాంతనిధీ
శాంతి స్వరూపా జీవనదీపా శాంతి సువార్తనిధీ ॥సిల్వ॥
2. తపములు తరచిన నిన్నె గదా జపములు గొలిచిన నిన్నెగదా
విఫలులు జేసిన విజ్ఞాపనలకు సఫలత నీవెగదా ॥సిల్వ॥
3. మతములు వెదకిన నిన్నెగదా వ్రతములు గోరిన నిన్నెగదా
పతితులు దేవుని సుతులని నేర్పిన హితమతి నీవెగదా ॥సిల్వ॥
4. పలుకులలో నీ శాంతి కధ తొలకరి వానగ గురిసెగదా
మల మల మాడిన మానవ హృదయము కలకలలాడెగదా ॥సిల్వ॥
5. కాననుతుల్య సమాజములో హీనత జెందెను మానవత
మానవ మైత్రిని సిల్వ పతాకము దానము జెసెగదా ॥సిల్వ॥
6. దేవుని బాసిన లోకవలోముచావుయె కాపురవండెగదా
దేవునితో సఖ్యంబును జగతికి రూవి నిడితివి గదా ॥సిల్వ॥
7. పాపము చేసిన స్త్రీనిగని పాపుల కోపము మండెగదా
దాపున జేరి పాపిని బ్రోచిన కాపరి నీవెగదా ॥సిల్వ॥
8. ఖాళీ సమాధిలో మరణమును ఖైదిగజేసిన నీవెగదా
ఖలమయుడగు సాతానుని గర్వము ఖండనమాయెగదా ॥సిల్వ॥
9. కలువరిలో నీ శాంతి సుధా సెలయేరుగ బ్రవహించెగదా
కలుష యెడారిలో కలువలు పూయుట సిలువ విజయముదా ॥సిల్వ॥