పాట `52
ప:యేసయ్యా... యేసయ్యా యేసయ్యా... యేసయ్యా
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే మా రాజువయ్యా ॥నిన్నే॥
1.కొండలలో లోయలలో అడవులలో యెడారులలో(2)
నన్ను గమనించినావా నన్ను నడిపించినావా... ఆ... నన్ను ॥నిన్నే॥
2.ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగ
అండ నీవైతివయ్యా నా... కొండ నీవే యేసయ్యా...ఆ...నిన్నే ॥నిన్నే॥
3.మరణచ్చాయలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున మెరిసిన
నీ కృప నన్ను బలపరచెనయ్యా నిన్నే ఘనపరుతునయ్యా ॥నిన్నే॥
4.వంచెన వంతెన ఒరిగిన భారాన పొసగక ఎగసిన విసిరే
కెరటాన కలలా కడ జేర్చినావా నీ వలలో నను మోసినావా ॥నిన్నే॥