పాట `80
ప: యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఆ... ఆ... ఆ...
1. మోషే ప్రార్దించగా మన్నాను కురిపించితివి
యెహోషువ ప్రార్ధింపగా సూర్యచంద్రులనాపితివి ॥యె॥
2. నీ ప్రజల పక్షవగా యుద్దములు చేసిన దేవా
అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి ॥యె॥
3. సింహాల బోనైనను సంతోషముగ వెళ్ళిరి
ప్రార్ధించినా వెంటనే రక్షించె నీ హస్తము ॥యె॥
4. చెరసాలలో వేసినా సంకెళ్ళతో బిగింంచినా
సంఘము ప్రార్ధించగా సంకెళ్ళు విడిపోయెను ॥యె॥
5. పౌలు సీలను బంధించి చెరసాలలో వేసినా
పాటలతో ప్రార్ధింపగా చెరసాల బ్రద్దలాయే ॥యె॥
6. మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని
లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము ॥యె॥