పాట`150
ప: నిన్ను చూసే కన్నులు ` నాకు ఇమ్మయ్యా
నిన్ను పిలిచే పెదవులు ` ఇమ్ము యేసయ్యా (2)
నిను చేరే పాదములు ` నాకు ఇవ్వయ్యా
నీ మాట వినే చెవులు ` ఇమ్ము యేసయ్యా ॥నిను చూసే॥
1. కన్నీటి ప్రార్ధన ` నాకు నేర్పయ్యా
ఆత్మల సంపద ` నాకు ఇవ్వయ్యా (2)
నాలోనే నిను చూపే ` మాదిరి నివ్వయ్యా ॥నిను చూసే॥
2. అందరితో సఖ్యత ` ఇమ్ము యేసయ్యా
మృదువైన మాటతీరు ` నాకు ఇవ్వయ్యా
కోపతాపములను ` దూరపరచయ్యా ॥నిను చూసే॥
3. లోతైన ఆత్మీయత ` నాకు ఇమ్మయ్యా
లోబడుట నాకు ` నేర్పు యేసయ్యా
లోపములన్ గ్రహించే ` కృపను ఇమ్మయ్యా
లోకాన్ని జయించే ` జీవిత మివ్వయ్యా ॥నిను చూసే