పాట `267
ప: ఓ ప్రేమగల యేసు ` ప్రేమించినావు మమ్ము
స్మరించుచు స్తుతింతున్ ` రక్షణ నిచ్చినావు
1. అద్భుతయాగమందు ` అందరికై బలిjైు
అందరి పాపములకు ` ప్రాయశ్చిత్తమైతివి ॥ఓ ప్రేమ॥
2. దాసులమై మేముండ ` మోషేను పంపితివి
చేసితివి స్వతంత్రులుగా ` నీ బాహుబలముతోడ ॥ఓ ప్రేమ॥
3. క్షమాపణా నందముతో ` సాగింపచేసిమమ్ము
యాత్రలో మాకు తోడై ` విజయము నిచ్చితివి ॥ఓ ప్రేమ॥
4. ఎడారి అడవిలోన ఊటల నదులు నడిపి
ఎండిన నేలనంత ` పచ్చిక బయలు చేసెన్ ॥ఓ ప్రేమ॥
5. బాబెలునుండి మమ్ము ` విడిపించితివి నీవు
బంధకముల తెంచి ` తప్పు బోధ బాపినావు ॥ఓ ప్రేమ॥
6. సహవాస మిచ్చి సంఘ ` అంగముల జేసినావు
సాక్షులను చేసిమమ్ము ` శత్రువుల సిగ్గుపరచె ॥ఓ ప్రేమ॥