పాట `106
ప: గగనము చీల్చుకొని ` యేసు ` ఘనులను
తీసికొని ` వేలాది దూతలతో భువికి ` వేగమె రానుండె
1. పరలోక పెద్దలతో బరివారముతో కదలి
ధర సంఘ వధువునకై తరలెను వరుడదిగో ॥గగ॥
2. మొదటగను గొఱ్ఱెగను ముదమారగ వచ్చెను
కొదమసింహపు రీతి కదలును గర్జనతో ॥గగ॥
3. కనిపెట్టు భక్తాళి ` కనురెప్పలో మారెదరు
ప్రథమమున లేచెదరు పరిశుద్ధులు మృతులును ॥గగ॥
4. ఆకాశ మధ్యము ` ప్రకాశవమానుండై
లోకాన రారాజై ` శోకము తొలగించు ॥గగ॥