పాట 3
ప: ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా
ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదము
అ.ప: ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
1.యెరికో గోడలు అడ్డు వచ్చినా ఆరాధించిరే గంభీరముగా
కూలిపోయెను అడ్డుగోడలు సాగిపోయిరి కానాను యాత్రలో (ఆరా)
2.పౌలు సీలలు బంధింపబడగా పాటలు పాడి ఆరాధించగా
బంధకములు తెంపబడెను వెంబడిరచిరి యేసయ్య నెందరో (ఆరా)
3.పెంతెకోస్తు పండుగ దినమునందు ఆరాధించి అందరు ఐక్యతతో
కుమ్మరించెను అగ్ని జ్వాలలు నింపబడెను ఆత్మబలముతో (ఆరా)