429
ప:ఇదిగో నీ రాజు వచ్చుచుండె సీయోను కుమారి
సంతోషించు యెరుషలేవ కుమారి ఉల్లసించు
1.నీదు రాజునీతితో దోషమేమియు లేకయే
పాపరహితుడు ప్రభు వచ్చుచుండె (ఇదిగో)
2.రక్షణ గలవాడుగా అక్షయుడగు యేసుడు
ఇచ్చతోడ యెరుషలేం వచ్చుచుండె (ఇదిగో)
3.సాత్వికుండు ఈ భువిన్ అత్యంతమగు ప్రేమతో
నిత్యరాజు నరులకై వచ్చుచుండె (ఇదిగో)
4.దీనపరుడు నీ ప్రభు ఘనత కలిగిన దేవుడు
ప్రాణమీయ పాపులకై వచ్చుచుండె (ఇదిగో)
5.ఇలనుగాడిదనెక్కియే బాలుర స్తోత్రవలతో
బలుడగు నీ ప్రభు వచ్చుచుండె (ఇదిగో)
6.దావీదు కుమారుడు దేవుడు పాపులకు
జయగీతవలతో వచ్చుచుండె (ఇదిగో)
7. యేసును ప్రేమించుచు హోసన్నా పాడెదవ
యేసుడిల వచ్చుచుండె హల్లెలూయ (ఇదిగో)