పాట -298
1.ఓ సద్భక్తులారా! లోకరక్షకుండు
బెత్లెహేమందు నేడు జన్మించెన్
రాజాధిరాజు ప్రభువైన యేసు,
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి ఊత్సాహవతో
2.సర్వేశ్వరుండు నరరూపమెత్తి
కన్యకు బుట్టి నేడు వేంచేసెన్
మానవజన్మ మెత్తిన శ్రీయేసూ!
నీకు నమస్కరించి నీకు నమస్కరించి
నీకు నమస్కరించి పూజింతువ
3.ఓ దూతలారా! ఊత్సహించి పాడి
రక్షకుండైన యేసున్ నుతించుడి
పరాత్పరుండా! నీకు స్తోత్రమంచు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి
4యేసూ! ధ్యానించి ఈ పవిత్ర జన్మ
ఊ.త్సాహవతోమీ వేళ స్తోత్రవ నర్పింతువ
అనాది వాక్యమాయె నరరూపు
నమస్కరింప రండి నమస్కరింప
రండినమస్కరింప రండి ఊత్సాహవతో