పాట `165
ప: నాదు జీవమాయనే నా సమస్తవ
నా సర్వస్వమేసుకే నాదు జీవవ
నాదుదైవవ దివిదివ్యతేజవ ॥నాదు॥
1.కృంగినవేళ బంగపడిన వేళ అద్దరికి చేర్చెను చుక్కానిలేని
నావ వలెనే నుండ అద్దరికి చేర్చెను ఆత్మతో నింపెను ఆలోచన చెప్పెను ॥నాదు॥
2.సాతాను బందినై కువలుచున్న వేళ
విడిపించే శ్రీ యేసుడే రక్తమంత కార్చి
ప్రాణమే బలిచేసి విమోచన దయచేసెను
సాతానును అణగద్రొక్క అధికార బలమిచ్చెను ॥నాదు॥
3.కారుమేఘాలే కమ్మిన వేళలో
నీతి సూర్యుడు నడిపెనుతుఫానులెన్నో చెలరేగి లేచినను
నడుపును నా జీవిత నావత్వరలో
ప్రభు దిగివచ్చును తరలిపోదును ప్రభునితో ॥నాదు॥