పాట -307పాట -
ప: చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున
చెంతజేరను రండి సర్వజనాంగమా సంతస మోoదుమా ||చింత||
1. దూతతెల్పెను గొల్లలకు శుభవార్త నాదివసంబు వింతగా
ఖ్యాతిమీరగా వారు యేసును గాంచిరి స్తుతులొనరించిరి ||చింత||
2. చుక్కకనుగొని జ్ఞానులెంతో మక్కువతో
నా ప్రభుని గనుగొన చక్కగా బెత్లేవపురమున జొచ్చిరి కానుకలిచ్చిరి ||చింత||
3. కన్యగర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు
ధన్యులగుటకు రండి వేగమే ధీనులై సర్వమాన్యులై ||చింత||
4. పాపమెల్లను పరిహరింపను పరమ రక్షకుడవతరించెను
దాపుజేరిన వారికిడుగడు భాగ్యవ మోక్షభాగ్యవ ||చింత||