పాట `352
ప: సిలువలో వ్రేలాడుచూ పలికిన అమృతమాటలలో
నీప్రేమను తలంచుకొనుచు నేసాగిలపడెదను
1. వీరలను క్షమించుమని
పలికిన ఆమాటలలో ఉన్నది క్షమాపణ
పాపిని పరదైసులో చేర్చుభాగ్యము ఇచ్చిన విడుదల ఉన్నది
ఆమ్రానుపై చేసిన విజ్ఞాపన ప్రార్ధన ॥సిలువలో॥
2. తల్లడిల్లిన తల్లిని అనురాగముతో ఓదార్చిన వేళలో
తండ్రి తనచేతిని విడిచి ఆత్మవేదన నొందినవేళలో (2)
ఆ సిలువమ్రానే విజ్ఞాపన బలిపీఠము ॥సిలువలో॥
3. ఆత్మల రక్షణకై దప్పికనొందిన వేళలో
హిస్సోపుతో పాపం పరిహరించెను (2)
విజయముతో తండ్రికి బలి అర్పణముగా ॥సిలువలో ఆసిలువలో॥