పాట `388
ప: కొనియాడ దరమె నిన్ను ` కోమల హృదయ `కొనియాడ దరమె
నిన్నుRతనరారు దినకరు`బెనుతారలను మించు`ఘనతేజముననొప్పు
కాంతిమంతు డ వీవు ॥కొనియాడ॥
1. ఖెరుబులు సెరుపులు`మరి దూత గణములుRసురుతరంబుగగొలువ`
నొప్పు శ్రేష్ఠుడ వీవు ॥కొనియాడ॥
2. సర్వలోకంబుల`బర్వు దేవుడ వయ్యుR నుర్వి స్త్రీ గర్భాన`నుద్భ
వించితి వీవు ॥కొనియాడ॥
3. విశ్వమంతయు నేలు `వీరాసనుడ వయ్యుR పశ్వాళితో దొట్టి `
పండియుంటివి నీవు ॥కొనియాడ॥
4. దోసంబులను మడియు`దాసాళి గరుణించి R యేసు పేరున జగతి`
కేగుదెంచితి నీవు ॥కొనియాడ॥
5. నరులయందున గరుణ`ధరసమాధానంబుRచిరకాలమునుమహిమ`
పర గ జేయుదువు వీవు ॥కొనియాడ॥
6. ఓ యేసు పాన్పుగ `నా యాత్మ జేకొని R శ్రేయముగ బవళించు
శ్రీకర వరసుత ॥కొనియాడ॥