పాట`101
ప. నా నీతి నీవే ` నా ఖ్యాతి నీవే నా దైవమా యేసయా
నా క్రియలు కాదు ` నీ కృపయే దేవా నా ప్రాణమా యేసయా
నదులంత తైలం ` విస్తార బలులు నీకిచ్చినా చాలవయ్య
నీ జీవితాన్నే నాకిచ్చినావు ` నీకే నా జీవమయ్య
హల్లెలూయ ` ఆమెన్ హల్లేలూయా (4)
1. నా దీనస్థితిని గమనించి నీవు ` దాసునిగా వచ్చావుగా
నాదోష శిక్ష భరియించి నీవు నను నీతో దాచావుగా
ఏమంత ప్రేమ నా మీద నీకు నీ ప్రాణమిచ్చావుగా
నీ రక్తమిచ్చి కొన్నావు నన్ను యజమానుడవు నీవేగా ॥హల్లె॥
2. నా ప్రియులు నన్ను వెలివేసినపుడు నీవు చేరదీసావుగా
నా ప్రక్క నిలచి నను ధైర్యపరచి ` కన్నీరు తుడిచావుగా
నేనున్న నీకు భయమమేలనంటూ ` ఓదార్పు నిచ్చావుగా
చాలయ్య దేవా నీ కృపయే నాకు బ్రతుకంతయు పండుగా
హల్లెలూయా ఆమెన్ (4) ॥నా నీతి॥