పాట `97
ప: యేసు మా రక్షకుడు కల్మషము లేనివాడు
సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయ
1. స్తోత్రించెదము దైవకుమారుని నూతన జీవముతో
నిరంతరము మారని రాజుని ఘనంబు చేయుదము ॥యేసు॥
2. భయంకరమైన భీతిని గొల్పెడు జిగట ఊబినుండి
బలమైన హస్తముతో నన్ను ఎత్తి బండపై స్థిరపరచెన్ ॥యేసు॥
3. కనుపాపగ నను కాయు ప్రభుండు కునుకడు నిద్రించడు
తన చేతిలో నను చెక్కిన ప్రభువునకు చేరిస్తుతించెదము ॥యేసు॥
4. తల్లిదండ్రియు యెడబాపినను విడువక కాయును
ఎల్లప్పుడు నేను భజింంచెదను వల్లభుడేసు ప్రభున్ ॥యేసు॥
5. ఆత్మీయ పోరాటమునకు ప్రభువు ఆత్మ శక్తినిచ్చెన్
స్తుతియునీకే ఘనతయు నీకేయుగయుగములలోన ॥యేసు॥