పాట`224
ప: యెహోవా నీ కృపాతిశయమను నిత్యము కీర్తింతున్
1. తరతరములకు నీ విశ్వాస్యత తెలియపరచెదను
కలువరి సిలువ రక్తముతో నిబంధన స్థిరపరచి
పాపము క్షమియించె ॥యెహోవా॥
2. ప్రతిశోధనపై నీవు నాకు విజయము నిచ్చెదవు
నన్ను విడిపించుటకు నీవు నమ్మ తగినవాడవు ॥యెహోవా॥
3. నీదు వాత్సల్యము నాపై నూతనముగా నుండున్
నీదు విశ్వాస్యత గొప్పదై మారనిదై యుండున్ ॥యెహోవా॥
4. నీదు రాకడవరకు నన్ను నిందా రహితునిగా
నమ్మకమైయున్న నా ప్రభువా నన్ను కాచెదవు ॥యెహోవా॥
5. మంచి పోరాటము పోరాడి జయమును పొందెదరు
మహిమ మకుటము నిచ్చెడు ప్రభునకు
హల్లెలూయ పాడెదన్ ॥యెహోవా॥