పాట 170
పమంచికాపరి మా ప్రభుయేసే
మా కొరకు ప్రాణమిచ్చె గొప్పకాపరి
మరణమన్నను భయము లేదులే
మధురమైన ప్రేమతో మమ్ము కాయులే
1.పచ్చిక బయళ్ళలో విశ్రమింపగా శాంతి జలాల చెంత అడుగు వేయగా
చేయి విడువక తోడు నిలచును (2)
నీతి మార్గమందు మమ్ము నడుపజేయును మంచి॥
2.అంధకార లోయలో మా పయనంలో లేదులే మాకు భయం అభయం తానే
ఆదరించును ఆశీర్వదించును (2)
అన్నీ త్రోవలందు మాకు తోడై యుండెను ॥మంచి॥
3.శత్రువుల మధ్యలో మాకు భోజనం అభిషేకం ఆనందం కృపా క్షేమము
బ్రతుకు నిండగా పొంగిపొర్లగా
చిరకాలం ఆయనతో జీవింపగా ॥మంచి॥