పాట `29
ప: ఈ గీతం మౌన గీతం ఈ రాగం హృదయ రాగం
స్తుతిగీతం మహిమ గీతం హృది మీటిన పరమ గీతం (2)
1.రాగంలో అనురాగంలో వేదనలో ఆవేదనలో (2)
నీవే శక్తి నీవే వక్తి నీవే మార్గం నీవే భక్తి నీవే శాంతి నీవే మోక్షం (2) ॥ఈ గీతం॥
2.అర్పణలో నా అర్పణలో అంధులలో నా అంధులలో (2)
నీవే నీతి నీవే జ్యోతి నీవే వేధం నీవే రక్తి నీవే కాంతి నీవే గమ్యం (2) ॥ఈ గీతం॥