పాట `72
ప: ఓ సంఘమా! నా సంఘమా! క్రీస్తు ప్రభుని ప్రియ దేహమా
కల్వరి రక్త దానమా! పరిశుద్ధుల సహవాసమా!
1. మారుతుంది ఈ లోకము మారుతుంది మన దేశము
మారుతున్న ఈ జగత్తులో మారడెపుడు యేసు నాధుడు(2) ॥ఓ॥
2. యేసు ప్రభువె నీ కాపరి నిన్ను మల్చినట్టి కుమ్మరి
ఎనలేని దీవెనలిచ్చి నిన్ను ఆదరించు దేవుడు(2) ॥ఓ॥
3. ప్రభువు నిన్ను కొనివేసెను రక్త క్రయము చెల్లించెను
రక్షణార్ధ బలిగ మారెను శిక్ష నీకు తొలగిపోయెను(2) ॥ఓ॥
4. అందరికి ప్రభు యేసుడు అభయ మిచ్చు మృత్యుంజయుడు
ఆయనే నీ రక్షకుడు సాటిలేని సుందరవరుడు(2) ॥ఓ॥
5. శాంతి మృగ్యమవుతున్నది కాంతి తరిగిపోతున్నది
సర్వలోక శాంతి కేంద్రము క్రీస్తు యేసే నీ శరణ్యము(2) ॥ఓ॥
6. నేటి సంఘమెటులుండునో రేపు సంఘమటులుండును(2) ॥ఓ॥
నేటియువత చిరు దీపికలు రేపు నీకు ఘన నాయకులు(2) ॥ఓ॥
7. సహవాసమే నీ నినాదవ సమైక్యతే నీ ధ్యేయవ
సువార్తయే నీ సునాదమువ సిలువ నీకు మణిభూషణవ(2 ॥ఓ॥