పాట `200
ప: నిన్ను నేను విడువను దేవ నీవు నను దీవించు వరకు నిన్ను
నమ్మిన వారల నెల్ల నీవు చక్కగ దీవించెదవు ॥నిన్ను॥
1. నేను శత్రువునైయుండగ నీవు నాపై నెనరుజూపి దాన
మిచ్చితివి నా కొరకు దారుడౌ నీ ప్రియ పుత్రుని ॥నిన్ను॥
2. త్రోవ దప్పి తిరుగుచుండ దుడుకునైన నన్ను గాంచి
బ్రోవగోరి మదిని నీవు త్రోవను బెట్టితివి నన్ను ॥నిన్ను॥
3. నాటనుండి నేటి వరకు నాకు గల్గిన శోధనవలలో
నీటుగా నను గాచిన వాడవు నీవు గావా, ఓ నా తండ్రి ॥నిన్ను॥
4. ఇంత కాలవ నన్ను గాచి ంకను నన్ను విడువ వనుచూ
సంతసించి మదిని నేను జక్కగ నీ దరి జేరితిని ॥నిన్ను॥
5. నీవు గాక యెవరున్నారు నేలపైన నను గాపాడ చేవలేని
నాకు నీవు చేవ గలుగ జేయగలవు ॥నిన్ను॥
6. అడుగు వారి కిచ్చెదనంచు నాన తిచ్చినావు గాన నడిగెద నీదు
సాహాయ్యంబు నాత్మవై యున్నట్టి తండ్రి ॥నిన్ను॥
7. నాదు ప్రార్ధనలన్నియు నీవు నీదు కృపచే నాలకించి నీదు
సరణిని నిల్పి నన్ను నేర్పు దనరగ రక్షించితివి ॥నిన్ను॥