పాట `54
ప: రండి సువార్త సునాదముతో రంజిలు సిలువ నినాదముతో
తంబుర సితార నాదముతో ప్రభుయేసు దయానిధి సన్నిధికి ॥రండి॥
1. యేసే మానవ జాతి వికాసం యేసే మానవ నీతి విలాసం
యేసే పతిత పావన నామం భాసుర క్రైస్తవ శుభనామం ॥రండి॥
2. యేసే దేవుని ప్రేమ స్వరూపం యేసే సర్వేశ్వర ప్రతిరూపం
యేసే ప్రజాపతి పరమేశం ఆశ్రిత జనముల సుఖవాసం ॥రండి॥
3. యేసే సిలువను మోసిన దైవం యేసే ఆత్మల శాశ్వత జీవం
యేసే క్షమాపణ అధికారం దాసుల ప్రార్ధన సహకారం ॥రండి॥
4. యేసే సంఘములో మనకాంతి యేసే హృదయములో ఘనశాంతి
యేసే కుటుంబ జీవనజ్యోతి పసిపాపల దీవెనవూర్తి ॥రండి।
5 యేసే జీవన వక్తికి మార్గం యేసే భక్తుల భూతల స్వర్గం
యేసే ప్రపంచ శాంతికి సూత్రం వాసిగ నమ్మిన జనస్తోత్రం ॥రండి॥