పాట `95
ప: నమ్మకమైన నాప్రభు నిన్ను నేస్తుతింతును నిన్ను నేస్తుతింతును
1. కరుణతోడ పిల్చియు స్థిరపరచి కాపాడిన
స్థిరపరచిన నా ప్రభున్ పొగిడి నేస్తుతింతును ॥నమ్మ॥
2. ఎన్నోసార్లు నీ కృపన్ విడిచియుంటినో ప్రభు
మన్ననతోడ నీదరిన్ చేర్చినన్ క్షమించితివి ॥నమ్మ॥
3. కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి
భంగపర్చు సైతానున్ గెల్చి విజయమిచ్చితివి ॥నమ్మ॥
4. నాకాశ్రయ శైలమై కోటగా నీవుంటివి
ప్రాకారంపు ంంటివై నన్ను దాచియుంచితివి ॥నమ్మ॥
5. సత్యసాక్షివైయుండి నమ్మదగినవాడవై
నిత్యుడౌ మా దేవుడా ఆమే నంచుపాడెద ॥నమ్మ॥