పాట `384
ప: కలువరిగిరి నుండి పిలచిన నా యేసు సిలువ మరణవను
గెలిచిన నా యేసు హల్లెలూయా హల్లెలూయ (4సార్లు)
1. మధుర ప్రేమను చూపించి నాపై మదిని నెమ్మది
చేకూర్చినావు మారని యేసు రాజా మరువను నిన్ను దేవా ॥హల్లె॥
2. బెదిరి బ్రతుకున నే చెదిరిపోగా వెదకిదరి చేరి సమకూర్చినావు
వేదనలు బాపి నావా విడువను నిన్ను దేవా ॥హల్లె॥
3. మర్త్యమైన ంహలోకమందే నిత్యరాజ్యవ నా కొసగినావు
శక్తిగల నీ నామంబు నిరతం భక్తితోనే ప్రకటింతు దేవా ॥హల్లె॥