ప: బండసందున పావురమా పేటు బీటుల పావురమా
ప్రియుడు నిన్ను కోరినాడు భీతిచెందకుమా
వరుడు నిన్ను కోరినాడు కలత చెంకుమా సిద్ధపడుమా ఓ సంఘమా
క్రీస్తు వచ్చు వేళాయే వేచి యుండుమా
యేసు వచ్చు వేళాయే వేచి యుండుమా ||బండ||
1. ప్రియుడు నిన్ను కోరెను వరుడు నిన్ను కోరెను నీ స్వరము
వినిపించుమా నీ ముఖము చూపించుమా యేసురాజు
దిగివచ్చువేళ నీవు సంసిద్ధమా నీవు పరిశుద్ధుమా
2. కొండ పేటులందున బండ బీటులందున నీగూడు నిర్మింపుమా
నీ ప్రియునికై చూడుమా లోక ఆశలు నీకేలనమ్మా
సిద్ధే వెలిగించుమా సిద్ధముగా నుండుమా ||బండ||
3. సాగరాలు పొంగినా నింగినేల కూలినా భయమేల ఓ సంఘమా
దిగులేల ప్రియ సంఘమా బండ క్రీస్తే నీ యండనుండ
గీతములు పాడుమా నీ ప్రియుని వీక్షింపుమా ||బండ||
4. ద్రాక్షాచెట్లు పూతపట్టి వాసనలిచ్చు చున్నవి చలికాలమే
గడిచెనమ్మా నిదురేల ప్రియ సంఘమా వరుడు యేసు దిగివచ్చు
వేళతరుణమే తెంచెనమ్మా నీ ప్రియును సంధించుమా ||బండ||