ప: నీతిమంతుల ప్రార్ధన దేవుడాలకించును
వారు తమాల వృక్షమువలె మొవ్వువేయుదురు
1. మొర పెట్టుము గ్రాహ్యము కాని గొప్ప సంగతులు
మరియు గూఢమైనసంగతుల దేవుడే తెలుపున్ ||నీతి||
2. గతకానమున క్రీస్తు పేరట అడుగకుంటిరి
సతతము ఆనందమొంద అడుగుడి దొరుకున్ ||నీతి||
3. యెహౌవాకొరకు ఎదురుచూచి పొందుడి బలము
ఇహమునందు పక్షిరాజువలె పై కెగురుదురు ||నీతి||
4. ఊహించలేనిది శక్యము గానివైనట్టి క్రియలను
యెహౌవా చేయ శక్తిమంతుడు అత్యధికముగా ||నీతి||
5. మిమ్ము విడువెన్నడు నెడబాయననెగదా
నమ్ముము నరమాత్రుం డెపుడే హానిచేయడు ||నీతి||
6. ఆ ప్రభు తన ఐశ్వర్యమందు క్రీస్తు యేసులో
మీ ప్రతి యవసరము తీర్చి కాచు నిరతమున్ ||నీతి||
7. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వతింతును
నిశ్చయముగా వృద్ధి పొందింతుననె నీ వువుడు ||నీతి||