పాట `280
ప: చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా (2)
నాతోడు నీవయ్యా నీ స్నేహం చాలయ్యా
నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువా యేసయ్యా
చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం (2) (చిర)
1. బంధువులు వెలివేసినా వెలివేయని స్నేహం
లోకాన లేనట్టి ఓదివ్య స్నేహం నా యేసు నీ స్నేహం (2) ॥చిర॥
2. కష్టాలలో కన్నీళ్ళలో నను మోj నీ స్నేహం
నను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం(2) ॥చిర॥
3. నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం
కలువరిలో చూపిన ఆశిలువ స్నేహం నాయేసు నీ స్నేహం (2) ॥చిర॥