పాట `26
ప: నమ్మదగినవాడు నా యేసుడు నన్ను ఇలలో నడిపించే నజరేjడు (2)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హోసన్నా
1.వాగ్దానమే మన ఆయుధం నిరీక్షణే మన ధ్యేయము (2)
యేసే మన రాజ్యము ఆనంద నిలయము (2)
ఆ యేసు ప్రేమకు ప్రతిబింబమే మనం (2) ॥నమ్మ॥
2.విశ్వాసమే మన కవచము విధేయతే మన లక్ష్యము (2)
యేసే మన జీవము పరలోక మార్గము (2)
ఆ క్రీస్తు ప్రేమను ప్రకటించెదం మనం (2)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హోసన్నా (2) ॥నమ్మ॥