పాట -295
ప:క్రిస్మస్ పండుగ వచ్చింది ఆనందమెంతో తెచ్చింది
నిన్నమోన్న నేడు రేపు దేవదేవుడే మనకు తోడునీడని తెలిసింది
పాడుదము నేడు పాడుదము క్రిస్మస్ గీతిపాడుదము
2) లా... లా...లలా... లలా... లలా... ||క్రిస్మస్||
1.దేవదేవుని కొలిచెదము బాలుని ఘనపరచెదవ (2)
ఈ వేళా? కాదు ఎల్లవేళలా యేసుని మనము
కొలిచెదము ఆయన చెంత నిలచెదము ||క్రిస్మస్||
2.శాంతి నిలలో స్థాపింప సామాన్యునిగా జన్మింప (2)
ఈనాడు కాదు ఏనాడో (2)
అంధకారమును తొలగించి ఆశాకిరణము వెలిగించె ||క్రిస్మస్||