పాట `24
ప:స్తోత్రము స్తుతి స్తోత్రవ చెల్లించుడి యేసుకే
రాజాధి రాజు దేవాది దేవుడు స్తుతులకు పాత్రుడు ॥స్తోత్ర॥
1. మనుష్య కుమారుడై మనుజుల పాపముకై
మహిలోన వెలసెను మరణించి లేచెను
మహిమ స్వరూపుడు ఆ...(2) ॥స్తోత్ర॥
2. పాపపు వస్త్రము మార్చి నీతిమంతులుగా తీర్చి
పరిశుద్ధులతో చేర్చి పరముకు భాగ్యము నిచ్చె
మహిమ స్వరూపుడు ఆ...(2) ॥స్తోత్ర॥
3.మేఘా రూఢుండై మన ప్రభు రానుండె
మహిమ శరీరముతో పరమున జేర్చును
మహిమ స్వరూపుడు ఆ...(2) ॥స్తోత్ర॥