పాట -290
ప: బెత్లెహేమను పురమందు స్వామి యేసుడు పుట్టాడంట
మనుజరూపం ధరిరంచి మానవాళిని రక్షించగ (2)
లోకమంత వెలుగు చీకటంత తొలగు
పుణ్యచరితుడేసు కన్న తనయుడేసు
రాజుని పూజింపగ సాగి వెళ్ళుదాం
అంబరాన్ని తాకేటి సంబరా
1. నిలవ లేని సత్రమందు పేద బాలుడై
పవళించినాడు పశుశాలలో
సర్వలోక రక్షకుడు ప్రేమ దాతయై
అవతారముర్తిగా ఉదరంచెనే (2)
రక్షణను సిద్ధపరచగా అక్షయుడు దిగి వచ్చెనే
శ్రీమంతుడైన యేసుడు ధీనుడై రల వెలసెనే (2)
పాపమెల్ల పరిహరింప స్వర్గమె విడచెనే
లోకమంత ఏలేటి దేవ దేవుడు ||బెత్లె||
2. దూత దర్శనానికి భీతి చెందెనే మందను కాచేటి గొల్లలంత
యెదనిండ సంతోషం ఉప్పొంగగ చూడవెళ్లినారట బాల యేసుని
భక్తితోడ మ్రోకరిల్లిరి హృదయమె అర్పించిరి
కరములే జోడించిరి నిజదేవుని కొనియాడిరి
సృష్టికర్త యేసుని ప్రార్థించుదాం ఆ దేవుని దీవెనలే వేడుకొందువ ||బెత్లె||