పాట -291
ప: శ్రీయేసుండు జన్మించె రేరలో నేఁడు పాయక
బెత్లెహేమను యురిలో ||శ్రీయేసు||
1.కన్నియ మరియమ్మ గర్భమందున ఇమ్మాను యేలనెడి నామమందున ||శ్రీయేసు||
2.సత్రమందున బశువుల సాలయందున దేవ పుత్రుండు మనుజుండాయె నందున ||శ్రీయేసు||
3.పట్టి పొత్తిగుడ్డలతోఁ జుట్టబడి పసుల తొట్టిలోఁ బరుండబెట్టఁబడి ||శ్రీయేసు||
4.గొల్ల లెల్లరు మిగుల భీతిల్లఁగఁ దెల్పె గొప్ప వార్త దూత చల్లఁగ ||శ్రీయేసు||
5.మన కొఱకొక్క శిశువు పుట్టెను ధరను మన దోషవలఁ బోఁగొట్టను ||శ్రీయేసు||
6. పరలోకపు సైన్యంబుఁ గూడెను మింట వర రక్షకుని గూర్చి పాడెను ||శ్రీయేసు||
7.అక్షయుండగు యేసువచ్చెను మనకు రక్షణంబు సిద్ధపర్చెను ||శ్రీయేసు||