పాట-285
ప:పుట్టినాడు పశువుల పాకలో
బెత్లెహేమనే ఒక ఊరిలో
లోకాలనేలే దేవాది దేవుడు పాపుల రక్షకుడు ||2||
అ.ప: హల్లెలూయ హోసన్నా హల్లెలూయ సంతోషమే ||2||
1.వెలుగే యిల ఉదయించగా చీకటి తొలగిపోయెను
ప్రభువే నరుడై పుట్టగా మన శాపము తొలగిపోయెను ||2||
మరణ భయం తొలగించగ దేవుడు మనిషిగ మారెను ||2|| ||హల్లె||
2.దుష్టుని కోటలు కూల్చగా బలవంతుడు జనియించెను
యూదా గోత్రపు సింహమై జయశీలుడు మనకై వచ్చెను ||2||
శాంతి, సమాధాన మియ్యగా సత్యవంతుడై వచ్చెను ||2|| హల్లె|| |