పాట `96
ప: రక్షకుడా యేసుప్రభో స్తోత్రము దేవా
స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపినదేవా ॥రక్ష॥
1.దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు? దూతలైనను
ప్రధానులైనను ప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరుచేయునా? ॥రక్ష॥
2. నరరూపమెత్తి ప్రభువు రిక్తుడాయెను
కరువైనను ఖడ్గమైనను ప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరుచేయునా? ॥రక్ష॥
3. సర్వలోక రక్షణకై సిలువనెక్కెను
శ్రమయునను బాధమైనను ప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరుచేయునా? ॥రక్ష॥
4. ఎంచలేని యేసు నాకై హింస పొందెనే హింసయునను
హీనతమైనను ప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరుచేయునా? ॥రక్ష॥
5.మరణమైన్ జంంచి క్రీస్తు తిరిగి లేచెను
మరణమైననుజీవమైనను ప్రభువు ప్రేమనుండి నన్ను
వేరుచేయునాక్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరుచేయునా? ॥రక్ష॥
6. నిత్యుడైన తండ్రితో నన్ను జేర్చెను ఎత్తైనను లోతైనను
ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా?
క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరుచేయునా? ॥రక్ష॥
7. ఎన్నడైనా మారని మా యేసుడుండగా ఉన్నవైనను రానున్ననవైనను
ప్రభువు ప్రేమ నుండి మవ్మ వేరుచేయునా?
క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరుచేయునా?
హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ ॥రక్ష॥