పాట`260
ప. జయము జయము యేసులో
జయము నీకే హల్లెలూయా (2)
విజయము కలుగునూ యేసుతోనే హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా (2)
1. యెరికో గోడలు కూలేను జయజయ గీతాలతో
సంకెళ్ళు వీడెనూ స్తుతిగల ప్రార్ధనలతో
ఉన్నాడు శక్తి గల రారాజు వింటాడు కన్నీటి ప్రార్థనలు (2)
స్తుతి స్త్తోత్రం వందనమయా
2. విలువైన నెత్తురు ఇచ్చెను విమోచన
త్రిత్వము ఏకమై ఇచ్చెను విడుదల
మరణపు ముళ్ళును విరిచెను మనయేసుడే
తిరిగిలేచెను ఘనమైన విజయముతో
స్తుతి స్తోత్రం వందనమయా
3. సాగెదం యేసుతో విశ్వాసం చేబూని
అసాధ్యము సాధ్యము చేసెను యేసుతో
జయము గొప్ప విజయము క్రీస్తులో
ఇచ్చెను మహ రక్షణ భాగ్యమ్
స్తుతి స్తోత్రం వందనమయా