పాట`134
ప: హర్షింతును హర్షింతును నా రక్షణ కర్త నా దేవునియందు ॥హర్షి॥
1. అంజూరపు చెట్లు పూయకుండినను
ద్రాక్షచెట్లు ఫలింపకున్నను ॥హర్షి॥
2. ఒలీవచెట్లు కాపులేకున్నను
చేనిలోని పైరు పండకున్నను ॥హర్షి॥
3. దొడ్డిలో గొర్రెలు లేకపోయినను
సాలలో పశువులు లేకపోయినను ॥హర్షి॥
4. లేడి కాళ్ళవలె నా కాళ్ళను జేసి
ఉన్నత స్థలముల మీదు నడుపున్ ॥హర్షి॥
5. నా కోట నా బలము నా యెహోవా
నీయందు నిత్యం నే హర్షింతున్ ॥హర్షి॥